Site icon HashtagU Telugu

Phones: ఫోన్లు వాడేవారికి హెచ్చరిక.. వెంటాడుతున్న ఆ వ్యాధి.. నలుగురిలో ఒకరికి..

Phoness

Phoness

Phones: ఇప్పుడు ఫోన్ వాడకం బాగా ఎక్కువైపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్ద వయస్సువారి వరకు ఫోన్ లేనిది ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ లోనే గడుపుతున్నారు. ఉదయం లేవగానే, రాత్రి నిద్రపోయే ముందు కూడా ఫోన్ చూస్తూవారు చాలామంది ఉన్నారు. రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వల్ల నిద్రలేమి సమస్యతో పాటు ఫోన్ లైట్ వల్ల కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఉదయం లేవగానే ఫోన్ చేయడం వల్ల ఒత్తిడి పెరగడంతో పాటు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి.

రోజులో ఎక్కువ గంటలు ఫోన్ వాడటం వల్ల ఒత్తిడి, ఆందోళన, హైపర్ టెన్షన్ లాంటి చాలా సమస్యలు వస్తాయి. ఇవన్నీ తెలిసినా మనిషి మాత్రం ఫోన్ లేకుండా ఉండలేదు. ఫోన్ తో ఎప్పుడూ ఏదోక పని ఉంటూనే ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ పనులతో పాటు వినోదం కోసం సినిమాలు చేడటం, గేమ్స్ ఆడటం లాంటి చాలా పనులు ఉంటాయి. ఇక కుటుంసభ్యులు, బంధువులతో ఫోన్లు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. దీంతో రోజువారి కార్యకలాపాల్లో ఫోన్ అనేది ప్రతిఒక్కరికీ నిత్యావసరంగా మారిపోయింది.,

అయితే అతిగా వాడేవారికి వచ్చే సమస్యల గురించి ఓ సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఫోన్ వాడే నలుగురిలో ముగ్గురికి నోమోఫోబియా అనేది వ్యాధి ఉన్నట్లు ఒప్పో నిర్వహించిన సర్వేలో తేలింది. నోమోఫోబియా నేది ణో మొబైల్ ఫోన్ ఫోబియా అని చెబుతున్నారు. ఈ వ్యాధి వల్ల ఫోన్ కు దూరం అవుతాయని, ఉపయోగించలేమా అని యూజర్లు భయపడుతారని ఒప్పో తన సర్వేలో తెలిపింది. అలాగే బ్యాటరీ లెవల్ 50 శాతం ఉన్నప్పుడు 10 మందిలో 9 మంది ఆందోళనకు గురవుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు.
ఫోన్లు ఉపయోగించేవారిలో 87 శాతం మంది ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నట్లు తేలింది.

Exit mobile version