Summer Trip: సమ్మర్ వెకేషన్ వెళ్లాలనుకుంటున్నారా.. తక్కువ బడ్జెట్ లో ఈ ట్రిప్‌కు వెళ్లండి!

  • Written By:
  • Updated On - April 7, 2024 / 12:13 AM IST

Summer Trip: ఎండలు దంచికొడుతున్నాయి.. ఉదయం 7 గంటలకే సూర్యుడు సెగలు రేపుతున్నాడు. ఎండ వేడిమి తాళలేక చాలామంది ఇళ్లకు పరిమితమవుతున్నారు. అయినా ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అయితే స్టార్స్, సెలబ్రిటీలు అలా విమానాల్లో వెళ్లి ఇలా ఎంజాయ్ చేసి వస్తారు. కానీ సామాన్యుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి విదేశాలకు వెళ్లలేరు. అలాంటివాళ్లు ఈ సమ్మర్ ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటే చిల్ అవ్వడంతో పాటు మెమోరీస్ ను సొంతం చేసుకోవచ్చు.

సాధారణంగా చాలా మంది సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి ప్రాంతాలకు ట్రిప్ వేస్తుంటారు. కాగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సిటిసి) ఓ బెస్ట్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దాని ప్రకారం ప్రయాణం,భోజనంతో పాటు వసతి ఉండనున్నది. ఐఆర్ సిటిసి అందించే తాజా టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 9 నుంచి మే 28 వరకు అందుబాటులో ఉండనున్నది. ‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్’పేరిట ఈ టూర్ ప్యాకేజీ అందిస్తున్నారు.

సికింద్రాబాద్, గుంటూరు, నల్గొండ, తెనాలి రైల్వే స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. సమయం తక్కువ కనుక వెంటనే ఆఫర్ ను వినియోగించుకోండి ! ఏప్రిల్ 9కి సంబంధించిన టికెట్లు అమ్ముడయిపోయాయి. ఇక మిగిలింది ఏప్రిల్ 16,23,30 మే14,21,28 తేదీలవి మాత్రం అందుబాటులో ఉన్నాయి.ఊటీని ‘హిల్ స్టేషన్ క్వీన్’ అంటారు. నీలగిరి జిల్లా రాజధాని ఊటీ. దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. నీలగిరి పర్వతాల్లో రైలు ప్రయాణం అదనపు ఆకర్షణ. ఊటీ ప్రదేశం సముద్ర మట్టానికి 2240 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఊటీలో సుందరమైన ప్రాంతాలను ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు.. ఊటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చూసి ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వీలైతే ఈ ట్రిప్ ను వెయండి మరి.