e-Pan Card: పాన్ కార్డు పోతే.. ఈజీగా ఈ- పాన్ కార్డు పొందొచ్చు.. ఎలాగంటే ?

పాన్ కార్డు కోల్పోతే కంగారు పడకండి. మళ్లీ కొత్తగా పాన్ కార్డు తీసుకోవాల్సిన పనిలేదు. అదే పాన్ కార్డును ఆన్‌లైన్ లో సులభంగా పొందొచ్చు.

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 07:45 AM IST

పాన్ కార్డు కోల్పోతే కంగారు పడకండి. మళ్లీ కొత్తగా పాన్ కార్డు తీసుకోవాల్సిన పనిలేదు. అదే పాన్ కార్డును ఆన్‌లైన్ లో సులభంగా పొందొచ్చు. ఆదాయ పన్ను వెబ్ సైట్‌లోకి లాగిన్ కావడం ద్వారా ఈ-పాన్ కార్డును పొందవచ్చు. పాన్ కార్డు నెంబర్ గుర్తుకు లేకపోతే ఆధార్ నెంబర్‌తో దీనిని పొందొచ్చు.
ఇందుకు ఆధార్-పాన్ లను అనుసంధానం చేసుకొని ఉండాలి.
పాన్ నెంబర్ గుర్తుకు లేకుంటే ఆధార్-పాన్ అనుసంధానం ఇదివరకే పూర్తయితే ఆధార్ నెంబ‌ర్‌తో క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఆధార్, పాన్ కార్డుల లింక్ లేకపోతే కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ నుంచి ఈ-పాన్‌ను డౌన్‌లోడ్ చేయలేరు.

ఈ స్టెప్స్ ఫాలో కండి..

* కొత్త‌ ఆదాయపు పన్ను పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలి.
* ఎడమ దిగువ భాగంలోని Our Services పైన క్లిక్ చేయండి.
* అక్క‌డ‌ Instant E-PAN క్లిక్ చేయాలి.
* New E PAN వద్ద క్లిక్ చేయండి.
* మీరు కోల్పోయిన పాన్ కార్డు నెంబర్ మీకు గుర్తు లేకుంటే ఆధార్ కార్డు నెంబర్‌ను నమోదు చేయాలి.
* నిబంధనలు, షరతులను చదివిన అనంతరం Accept పైన క్లిక్ చేయాలి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పైన OTP వస్తుంది.
* OTPని నమోదు చేయాలి.
* వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకొని, మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి Confirm పైన క్లిక్ చేయాలి.
* ఈ మెయిల్ ఐడీకి మీ ఈ-పాన్ వ‌స్తుంది. అక్క‌డ‌ ఈ-పాన్ PDFను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
* మీరు పాన్‌కార్డు కోసం అప్ల‌య్ చేసిన సమయంలో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి ఉంటారు. అందులో ఏదో ఒకదాని ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* పాన్ కార్డు ప్రింట్ అవసరమైతే.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) వెబ్ సైట్ విజిట్ చేయండి. ఇక్కడ మీ కొత్త పాన్‌కార్డు ప్రింట్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.
* ఈ కొత్త పాన్ కార్డు మీ రిజిస్టర్డ్ అడ్రస్ కు చేరడానికి క‌నీసం 10 నుంచి 15 రోజులు పట్టొచ్చు.
* ఆలోగా పాన్‌కార్డుతో ఏదైనా అవ‌స‌రం ఉంటే.. ఇలా ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోని వినియోగించుకోవచ్చు.