Skin care: మెరిసే చర్మం కోసం.. ఈ టిప్స్ ఫాలోఅవ్వండి!

చర్మాన్ని మనం ఎంతగా ప్రేమిస్తే.. అది అంత అందంగా ఉంటుంది. మచ్చలు లేని చర్మం.. మృదువుగా మెరిసే చర్మం కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.

  • Written By:
  • Updated On - March 18, 2022 / 05:31 PM IST

చర్మాన్ని మనం ఎంతగా ప్రేమిస్తే.. అది అంత అందంగా ఉంటుంది. మచ్చలు లేని చర్మం.. మృదువుగా మెరిసే చర్మం కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మరి మన చర్మం అందంగా, అద్భుతంగా కనిపించాలంటే నైట్ కేర్ స్కిన్ రోటిన్ ని ఫాలో అవ్వాల్సిందేనని నిపుణులు అంటున్నారు.

చాలామంది మేకప్ లేనిదే ఉండరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేకప్ తోనే ఉంటారు. పడుకునే ముందు అంటే రాత్రి ఆ మేకప్ తప్పనిసరిగా తొలగించాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చర్మాన్ని సంరక్షించుకునేందుకు తగి క్లీనర్ తో మేకప్ తీయడం చాలా ముఖ్యం. ఆ మేకప్ తొలగించండం మర్చిపోకూడదు. మీ ముఖం నుంచి ఐలైనర్స్, బ్లష్, మేకప్ ను తొలగించడంలో ఆచరణీయంగా ఉండాలి. ఏది పడితే అది వాడకూడదు. బాదం నూనెను ఉపయోగించి మేకప్ తొలగించడం బెస్ట్. దీంతో ముఖంపై ప్రత్యేక మెరుపు రావడం ఖాయం. మృదువైన హైడ్రేటింగ్ స్కిన్ కోసం ఆస్ట్రింజెంట్ లేదా టోనర్ ను ఉపయోగించాలి. టోనర్స్ మట్టి, నూనెలు, కాలుష్యాన్ని శుభ్రం చేసేందుకు సహాయపడుతాయి. ఫేషియల్ టోనర్ ముఖ్యంగా రోజ్ వాటర్ ను ఉపయోగించాలి. ఇది సాధారణంగా హైడ్రేటింగ్ గా పనిచేస్తుంది. ఈ టోనర్ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది.

కాటన్ లో కొంచెం టోనర్ పోసి చర్మం నెమ్మదిగా రుద్దాలి. లేదంటే స్ప్లాష్ చేస్తుండాలి. రోజ్ వాటర్ లేదా దోసకాయ టోనర్ తో మీ ముఖాన్ని స్ప్లాష్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కేవలం ముఖంపైన్నే కాకుండా మెడకు కూడా టోనర్ ఉపయోగించాలి. అలా అప్లై చేసిన తర్వాత కొంత సమయం వరకు అలాగే ఉంచాలి. అది చర్మంలోకి ఇంకిపోతుంది. ఆ తర్వాత మీ చర్మం బయటి పొరను రక్షించేందుకు సీరమ్ ను వాడటం ప్రారంభించాలి. చర్మానికి ఆచరణీయ పదార్థాలతో సీరం ఉపయోగించాలన్ని విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంంది. ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ తో ఉన్న హైలురోనిక్ యాసిన్ కలిగి ఉన్న ఫేస్ సీరమ్ లు చర్మానికి మంచిది. చర్మాన్ని మెరిసేలా అందంగా చేయడానికి సహాయపడతాయి. చర్మానికి మాయిశ్చరైజింగ్ కూడా చాలా ముఖ్యం. ఆర్గనిక్ ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తే ఇంకా మంచిది. ప్రతిరోజూ రాత్రిపూట ఉపయోగించినట్లయితే మీ చర్మం అందంగా మెరిసిపోతుంది. ఈ నైట్ స్కిన్ కేర్ రోటిన్.. చర్మాన్ని అందంగా మెరిసేలా చేయడంలో ఉపయోగపడుతుంది.