Site icon HashtagU Telugu

Waltair Veerayya: 115 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకున్న ‘వాల్తేరు వీరయ్య’  

Walther Veeraiah

Walther Veeraiah

మెగాస్టార్ చిరంజీవితో కలసి మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రోజురోజుకు కలెక్షన్లు పెరిగాయి. ఇదిలావుండగా, ఈ సినిమా ఈరోజుతో 70 డైరెక్ట్ సెంటర్లలో,  ఓవరాల్ గా 115 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇది ఖచ్చితంగా గొప్ప విజయమే, ఏ సినిమా అయినా లాంగ్ రన్ ఇవ్వడం ఛాలెజింగ్ టాస్క్.

వింటేజ్ మెగాస్టార్ ని చూపించడంతో పాటు, రవితేజను ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ప్రజంట్ చేసి అందరి మనసుని గెలిచుకున్నాడు దర్శకుడు బాబీ కొల్లి. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మెగా బడ్జెట్‌తో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, టాప్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.