Site icon HashtagU Telugu

VRO Job Fraud: ఉద్యోగంతో నిరుద్యోగులను మోసం చేసిన వీఆర్వో.. లక్షలకు లక్షలు దోచేసిందిగా?

BSF Recruitment 2024

BSF Recruitment 2024

దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇటువంటి సమయంలో నిరుద్యోగుల ఆశలను ఆసరాగా తీసుకున్న కొందరు దుర్మార్గులు, సైబర్ క్రైమ్ వారు ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులకు ఆశలు చూపించి లక్షలకు లక్షలు కాజేస్తున్నారు. చదువుకున్న వారు నిరుద్యోగులకు అండగా ఉండాల్సింది పోయి ఈ విధంగా దారుణలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక విఆర్వో నిరుద్యోగులను మోసం చేసి లక్షలకు లక్షలు కాజేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడలో రేఖ అనే ఒక మహిళ వీఆర్వో గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈజీ మనీ కి అలవాటు పడిన రేఖా నిరుద్యోగున్ని టార్గెట్ చేసింది. దీంతో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడటం మొదలుపెట్టింది. ఉద్యోగం లేక అల్లాడిపోతున్నామంటూ కొందరు నిరుద్యోగులు వచ్చి ఆమె దగ్గర గోడును వెళ్ళబోసుకున్నారు. నిరుద్యోగులకు ఎర వేయడం ప్రారంభించింది. తను వీఆర్వో కాబట్టి పై అధికారులతో పరిచయాలు ఉన్నాయి అడిగినంత డబ్బులు ఇప్పిస్తే ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ నిరుద్యోగులకు ఆశ చూపించి నమ్మపలికింది.

వీఆర్వో కావడంతో చాలామంది ఆమె మాటను నమ్మి 3 లక్షల నుంచి దాదాపు 8 లక్షల వరకు ఆమెకు ముట్టచెప్పారు. డబ్బులు బాగానే వసూలు చేసిన విఆర్వో అదిగో ఇదిగో అంటూ మాట దాటిస్తూ వచ్చింది. కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని ఉద్యోగాలు రావడానికి సమయం పడుతుందని అబద్ధాలు చెబుతూ వచ్చింది. వాళ్లు కూడా వీఆర్వో మాటలను గుడ్డిగా నమ్మేశారు. రోజులు గడుస్తున్న కొద్ది ఆమె నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆమెను గట్టిగా నిలదీశారు. ఆమె ముఖం చాటేయడంతో వెంటనే మోసపోయాము అని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టి విఆర్ఓ ని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version