Site icon HashtagU Telugu

Vijayawada : విజయవాడలో వివిధ కళాశాలల్లో పోలీసుల జులుం.. బ‌ల‌వంతంగా సెల‌వులు ప్ర‌క‌టించిన యాజ‌మాన్యం

Police

Police

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్‌ను వ్య‌తిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, మ‌హిళ‌లు పెద్ద ఎత్తున రోడ్ల‌పైకి వ‌చ్చి త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు ఇటు విద్యార్థులు సైతం చంద్ర‌బాబుతో మేమంటూ ఆందోళ‌న‌కు సిద్ధ‌మైయ్యారు. విజ‌య‌వాడ‌లోని వీఆర్ సిదార్థ ఇంజ‌నీరింగ్ కాలేజీ విద్యార్థులు ఈ రోజు సాయంత్రం చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ర్యాలీ చేయ‌నున్నారు. అయితే పోలీసులు మాత్రం ర్యాలీకి అడ్డుక‌ట్ట వేశారు. సిద్ధార్థ, పీవీపీ సిద్ధార్థ కాలేజీలోకి పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లారు. తరగతులు సస్పెండ్ చేయించిన కళాశాలలకు సెలవు ఇప్పించారు. కళాశాలలో ఎవరూ ఉండకూడదంటూ విద్యార్థులను బయటకు పంపిచారు. చంద్రబాబు మద్దతుగా నిలవాలని ఇప్ప‌టికే వాట్సాప్ ల్లో విద్యార్థులు మెసేజ్ లు పెట్టుకున్నారు.దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ముంద‌స్తుగా చ‌ర్య‌లు తీసుకున్నారు.