Site icon HashtagU Telugu

Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే చెత్తలో వేసినట్లే: కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫామ్‌హౌస్‌ పార్టీకి ఓటు వేయడం చెత్త పెట్టెలో వేసినట్లేనని అన్నారు.బీఆర్‌ఎస్‌ ఎంపీలు తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు . రాష్ట్రంలో గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రేషన్‌కార్డు ఇవ్వకపోగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు హామీల కోసం దరఖాస్తు చేసుకుని రేషన్‌కార్డులు అడుగుతున్నా రేషన్‌కార్డులో సవరణలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లి అరెస్ట్ అయిన వారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డీజీపీని ఆదేశించి వివరాలు తీసుకురాగలదా? అలాగే రూ.2,500 ఎవరికి ఇస్తారనే విషయంలో కూడా క్లారిటీ లేదన్నారు కిషన్ రెడ్డి.

పార్లమెంటు ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించేంత వరకు తెలంగాణ ప్రజల నుంచి దరఖాస్తు కోరడం డ్రామా మాత్రమేనని ఆరోపించారు. దరఖాస్తు కోసం ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్లీనరీలో మోడీకి మందు అయిపోయిందన్న రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. మోడీ మందు ఎలా అయిపోయిందో చెప్పాలని రేవంత్ ను నిలదీశారు. రాహుల్ ఉన్నంత మాత్రాన మోడీ మందు ముగియదని పేర్కొన్నారు.

Also Read: Kuwait PM: కువైట్ కొత్త ప్రధానిగా షేక్ మొహమ్మద్ సబా అల్-సలేమ్ అల్-సబా