Vote From Home: ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

తెలంగాణాలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయి. త్వరలో దీనికి సంబందించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు వచ్చి ఓటర్ల జాబితాను రెడీ చేసింది.

Vote From Home: తెలంగాణాలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయి. త్వరలో దీనికి సంబందించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు వచ్చి ఓటర్ల జాబితాను రెడీ చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు, లేదా అంగవైకల్యం వ్యక్తులు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల అధికారి సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణాలో వయసు మళ్ళిన వ్యక్తులు, 40 శాతం దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అలా కానీ పక్షంలో పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయాలనుకుంటే పికప్, డ్రాపింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లోగా 12D ఫారం కింద దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి ఎన్నికల సంఘం అధికారులు వెళ్లి ఏర్పాట్లు చేస్తారు. కర్ణాటకల అసెంబ్లీ ఎన్నికలు, మునుగోడు, నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్‌లో కూడా ఈ విధానాన్ని ఎన్నికల సంఘం అమలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. పార్టీల హాడావిడితో ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది. అభ్యర్థుల జాబితాలు, బహిరంగ సభలతో పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎలక్షన్స్ నిర్వహించాల్సిన విషయం తెలిసిందే.

Also Read: Abbaiah Vooke : కోట్ల రూపాయిల పనిచేసిన..రూపాయి కూడా వెనకేసుకొని నిస్వార్ధపరుడు