Site icon HashtagU Telugu

R Day: రిప‌బ్లిక్ డే పరేడ్‌కు విజయనగరం బాలిక

Neha Thomas

Neha Thomas

జనవరి 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌కు విజ‌య‌న‌గ‌రం బాలిక ఎంపికైయ్యారు. సీతామ్ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చ‌దువుతున్న విద్యార్థిని, ఎన్‌సీసీ క్యాడెట్ అన్నా నేహా థామస్ ఎంపికయ్యారు.

రిప‌బ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం ఆనందకరమైన అనుభూతి అని ఆమె అన్నారు. ఎంపిక ప‌క్రియ సంద‌ర్భంగా ఐదు రౌండ్లలో గట్టి పోటీ నెలకొందని నేహా థామ‌స్ తెలిపారు. సమయపాలన, క్రమశిక్షణ, డ్రిల్ ఖచ్చితత్వం, వ్యక్తిత్వం మరియు అభిరుచులలో నైపుణ్యం అన్నీ జాగ్రత్తగా ఎంపిక‌లో ప‌రిశీలించార‌ని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఎన్‌సీసీ డైరెక్టరేట్‌లో న్యూ ఢిల్లీలో తుది శిక్షణ పొందుతోంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఇద్దరు బాలికల్లో ఆమె ఒకరు కావడం విజయనగరం పౌరులకు గర్వకారణం. నేహా సాధించిన విజయానికి సీతామ్ కళాశాల గర్విస్తున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మూర్తి తెలిపారు.