Site icon HashtagU Telugu

Bheemili Beach: విషాదం.. బీచ్‌లో ఇద్దరు విద్యార్ధులు గల్లంతు..!

Beach Imresizer

Beach Imresizer

విశాఖ జిల్లా భీమిలి బీచ్‌లో విషాదం నెలకొంది. బీచ్ లో ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు. బీచ్‌లో గల్లంతు అయిన విద్యార్థులు ఇద్దరు స్టూడెంట్స్‌గా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక అధికారులు గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గజ ఈతగాళ్ల సాయంతో బోట్లలో గాలిస్తున్నారు. నేవీ హెలికాప్టర్, మూడు స్పీడ్ బోట్లతో గాలింపు కొనసాగిస్తున్నారు. కాలేజీకి లేట్ కావడంతో విద్యార్థులు బీచ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. గల్లంతు అయిన విద్యార్థులను వేమల సూర్యవంశీ, కుడితి సాయిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.