MI vs SRH: ఐపీఎల్ 2023లో ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ మరియు వివ్రాంత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్ తొలి క్యాప్‌ను వివ్రాంత్ శర్మకు అందించాడు. కాగా ఈ యంగ్ ప్లేయర్ పరుగుల వర్షం కురిపించి మొదటి ఐపీఎల్ ఫిఫ్టీని సాధించాడు. శర్మ ఆరంభం నుంచే పరుగుల వరద పారించాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి బౌలర్లకు చుక్కలు చూపించాడు. వివ్రాంత్ 36 బంతుల్లో మొత్తం 8 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14వ ఓవర్ ఐదో బంతికి వివ్రాంత్ శర్మ ఔటయ్యాడు. రమణదీప్ సింగ్ వివ్రాంత్ శర్మ ఇచ్చిన క్యాచ్ పట్టుకుని పెవిలియన్ పంపాడు. ఐపీఎల్ తన మొదటి ఇన్నింగ్స్ లో వివ్రాంత్ 69 పరుగులతో సత్తా చాటాడు. మయాంక్ అగర్వాల్ 32 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేశాడు.
Maiden IPL innings, maiden IPL FIFTY 🔥🧡 pic.twitter.com/Mwjoj83ZyS
— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2023
23 ఏళ్ల వయసులో వివ్రాంత్ శర్మ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు దేశవాళీ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో ఆడాడు. వివ్రాంత్ మొత్తం 9 T20 మ్యాచ్‌లు ఆడి 191 పరుగులతో 6 వికెట్లు తీసుకున్నాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 128గా ఉంది.