Site icon HashtagU Telugu

Vivek Venkataswamy : కాంగ్రెస్ పార్టీ లోకి వివేక్ వెంకటస్వామి..?

vivek venkataswamy joins congress party

vivek venkataswamy joins congress party

తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలలో వలసలు మొదలయ్యాయి. ఏపార్టీ లో ఉంటె తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందో నిర్ణయించుకొని అందులో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ , బిజెపి పార్టీలలో వలసలు పర్వం నడుస్తుంది. ఈ క్రమంలో బిజెపి పార్టీ కి భారీ షాక్ తగలబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపి పార్టీ సీనియర్ నేత, వి6 అధినేత వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) ..కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వినికిడి.

ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) జోరు పెరిగింది. కర్ణాటక ఎన్నికల ముందు వరకు కూడా పార్టీ లో అంతర్గత విభేదాలు , రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కష్టమే అనే అనుమానాలు , కార్యకర్తల్లో , నేతల్లో పెద్ద ఉత్సాహం లేకపోవడం ఉండేది. కానీ ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందో..తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో , కార్యకర్తల్లో ఉత్సాహం మొదలైంది. అదే తరుణంలో నేతలంతా కలిసి కట్టుగా ఉండడం, వరుస సమావేశాలు , సభలు జరుగుతుండడం..రాష్ట్రంలో కీలక రాజకీయ నేతలుగా ఉన్న..పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) , జూపల్లి (Jupally Krishna Rao) వంటి వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం తో అందరిలో కాంగ్రెస్ ఫై నమ్మకం మొదలైంది. మరోపక్క అప్పటి వరకు హడావిడి కోసాగించిన బిజెపి టక్కున సైలెంట్ అవ్వడం..రాష్ట్ర అధ్యక్షా పదవి నుండి బండి సంజయ్ ని తప్పించడం..ఇవ్వన్నీ కూడా కాంగ్రెస్ కు బలం పెంచేలా చేసాయి.

అధికార పార్టీ బిఆర్ఎస్ సైతం తన ఫోకస్ ను బిజెపి (BJP) నుండి కాంగ్రెస్ వైపుకు మళ్లించింది. వరుస కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేస్తుంది. దీంతో అందరిలో బిఆర్ఎస్ ను ఓడించాలంటే అది కాంగ్రెస్ కే సాధ్యం అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాజాగా బిఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల ప్రకటన కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చేలా చేసింది. రాష్ట్రంలో ఎక్కువ గా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్స్ ఇవ్వడం తో..టికెట్ రాని నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం కీలక నేత తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageswara Rao) బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి , కాంగ్రెస్ లో చేరబోతారనే వార్తలు ప్రచారం అవుతుండగా..ఇక ఇప్పుడు బిజెపి పార్టీ సీనియర్ నేత, వి6 అధినేత వివేక్ వెంకటస్వామి సైతం బిజెపి పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 30 న ఈయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి రాష్ట్రంలో బిజెపి హావ రోజు రోజుకు తగ్గుతూ..కాంగ్రెస్ హావ పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది.