Mamata Banerjee: ఈ మధ్య సినిమాలు రాజకీయంగా ప్రభావం చూపుతున్నాయి. కథలో బలముంటే సినిమాను విమర్శకులు సైతం ప్రశంసించే పరిస్థితి. చిన్న సినిమాగా వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఊహించని రీతిలో ఆకట్టుకుంది.ఇక తాజాగా ది కేరళ స్టోరీ సినిమా విడుదలైంది. ఈ రెండు చిత్రాలు వివాదంలో ఇరుక్కున్నాయి. రాజకీయ నేతలు సైతం సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా ది కేరళ స్టోరీ సినిమా వివాదం నడుస్తుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సినీ నిర్మాత వివేక్ అగ్నిహోత్రి మంగళవారం లీగల్ నోటీసు పంపారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై మమతా బెనర్జీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అగ్నిహోత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. అగ్నిహోత్రి మాట్లాడుతూ ‘గత ఏడాది కాలంగా నేను ఎలా జీవిస్తున్నానో, నేను మీకు మాత్రమే చెప్పగలను. కొంతమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు నన్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది నా కుమార్తెను వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారని, ఇది సిగ్గులేని చర్య అంటూ మంది పడ్డారు అగ్నిహోత్రి.
‘ది కాశ్మీర్ ఫైల్స్’ విడుదలైన తర్వాత పలు విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం కేరళ స్టోరీ సినిమాపై రచ్చ నడుస్తుంది. బెంగాల్‌లో సినిమాపై నిషేధం విధించారు. అంతకుముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అంటే ఏమిటి? ఇది ఒక వర్గాన్ని కించపరిచే లక్ష్యంతో రూపొందించబడింది. ‘ది కేరళ స్టోరీ’ అంటే ఏమిటి? ఇదొక ట్విస్టెడ్ స్టోరీ. సినిమాను వక్రీకరిస్తున్నది బీజేపీయేనని ఆమె అన్నారు.
Read More: Odisha Encounter: ఒడిశాలో ఎన్ కౌంటర్ కలకలం.. ముగ్గురు మావోయిస్టుల మృతి