Vishwak Sen: క్రేజీ కాంబినేషన్.. విశ్వక్ సేన్ తో ఐశ్వర్య అర్జున్‌!

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Vishwak Sen

Vishwak Sen

సరైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచయిత, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్న విశ్వక్ సేన్ 11వ చిత్రంను ఒక ప్లజంట్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. మల్టీ ట్యాలెంటడ్ స్టార్లయిన విశ్వక్ సేన్, అర్జున్‌లది చాలా ఆసక్తికరమై కాంబినేషన్. ఫలక్‌నుమా దాస్ లాంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్, ప్రస్తుతం తన దర్శకత్వంలో తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’తో బిజీగా ఉండగా, అర్జున్ తన సుధీర్గ కెరీర్‌లో అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు

అర్జున్ హోం బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నెం 15లో స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాతో తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ని తెలుగులో కథానాయికగా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే కన్నడలో తన ప్రతిభ చాటుకున్న ఐశ్వర్య అర్జున్‌ ఈ ప్రాజెక్ట్ తో తెలుగులోకి రావడం పర్ఫెక్ట్ ఎంట్రీ కానుంది. సీనియర్ నటుడు జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది రోడ్ ట్రిప్ చిత్రం. విశ్వక్ సేన్‌ను అర్జున్ విలక్షణమైన పాత్రలో చూపించనున్నారు. ప్రొడక్షన్ పనులు ప్రారంభించడంతో చిత్ర యూనిట్ సినిమా ప్రయాణం త్వరలో ప్రారంభించబోతుంది. చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

  Last Updated: 20 Jun 2022, 12:03 PM IST