Nirjala Ekadshi : ఈ వస్తువులను దానం చేస్తే విష్ణుమూర్తి సంతోషిస్తాడు..!!

హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతినెలలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఆదిమాస సమయంలో ఏకాదశుల సంఖ్య 26 అవుతుంది. ఇందులో ఒక ఏకాదశి కృష్ణ పక్షం కాగా రెండవది ఏకాదశి శుక్ల పక్షం.

  • Written By:
  • Publish Date - June 10, 2022 / 07:00 AM IST

హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతినెలలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఆదిమాస సమయంలో ఏకాదశుల సంఖ్య 26 అవుతుంది. ఇందులో ఒక ఏకాదశి కృష్ణ పక్షం కాగా రెండవది ఏకాదశి శుక్ల పక్షం. ఈ సారి జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షానికి చెందిన ఏకాదశి జూన్ 10 శుక్రవారం వస్తుంది. ఈ రోజున భక్తులు పచ్చినీరు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేశారు. ఈరోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు.

ఏకాగ్రతతో లక్ష్మీనారాయణున్నిపూజించినట్లయితే ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం సమృద్ధిగా వస్తాయి. అన్ని రకాల దుఃఖాలను దూరం చేసే ఈ నిర్జల ఏకాదశి వ్రతం చేయడం చాలా కష్టం కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి.

నిర్జల ఏకాదశి వ్రతం తేదీ ,శుభ సమయం..
నిర్జల ఏకాదశి ఉపవాసం శుక్రవారం 2022 జూన్ 10న పాటిస్తారు. ఏకాదశి జూన్ 10వ తేదీ ఉదయం 7:25 గంటలకు ప్రారంభమై జూన్ 11వ తేదీ సాయంత్రం 5:00 గంటల ముగుస్తుది. ఉపవాసం శుభ సమయం మధ్యలో ఉంది.

ఉపవాసం ,దాతృత్వం ప్రాముఖ్యత..
ఈ నిర్జల ఏకాదశిన ఉపవాసం శ్రీమహావిష్ణువు తన తల్లి లక్ష్మిని సంతోషంగా ఉంచడానికి చేస్తారు. ఈ రోజున మంచినీళ్లు కూడా సేవించకుండా రోజంతా ఉపవాసం ఉంటారు. జ్యేష్ఠ మాసంలో మండుటెండలో ఇలాంటి తీర్మానం చేయడం చాలా కష్టం. అయినా కూడా ఈ వ్రతాన్ని గొప్ప నియమాలు ,సంయమనంతో పాటిస్తారు. రోజంతా నీరు తాగకపోవడం వల్ల నీరసించిపోయతారు. కానీ నిర్జన ఏకాదశి వ్రతం చేసేవాళ్లకు అలాంటిదేమీ ఉండదు. దృఢ సంకల్పంతో పస్తులుండి వ్రతం చేసినట్లయితే శ్రీమహావిష్ణువు ,లక్ష్మి తల్లి ప్రసన్నులవుతారు.

ఈ వ్రతం చేస్తే ఇల్లు సంపదతో నిండి ఉంటుంది. నిర్జల ఏకాదశి వ్రత దానం కూడా దాతృత్వానికి ప్రాముఖ్యత ఉంది. తీవ్రమైన వేడిలో చల్లని వస్తువులను దానం చేయడం ద్వారా విష్ణువు సంతోషిస్తాడు. ఈ వ్రతంలో కరక్కాయ, పచ్చిమిర్చి, నీళ్లతో నింపిన కాడ మొదలైన వాటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. నిర్జల ఏకాదశి వ్రతంలో వేసవిలో ఉపయోగపడే వస్తువులైన గొడుగు, దుస్తులు మొదలైన వాటిని కూడా దానం చేస్తే మంచిది. నిర్జల ఏకాదశి వ్రతం రోజున దాహంతో ఉన్నవారికి నీరు అందించినట్లయితే పుణ్యం లభిస్తుంది.