శుక్రవారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(Visakhapatnam Steel Plant)లో భారీ ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. ఏ1, ఏ2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తప్పడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం వల్ల స్టీల్ ప్లాంట్‌కు కొంత నష్టం జరిగినట్లు తెలుస్తుంది. సుమారు 60 టన్నుల ఉత్పత్తి నాలుగు రోజుల పాటు నిలిచిపోయే అవకాశం ఉందని ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.
Game Changer : ఐమ్యాక్స్ లో ‘గేమ్ ఛేంజర్’..మెగా ఎక్స్ పీరియన్స్ మాములుగా ఉండదు మరి ..!!
ఈ బెల్టు ద్వారా బొగ్గు ఐరన్ బోర్డు తరలింపు జరుగుతుంది. కన్వేయర్ బెల్ట్‌లు పడిపోవడంతో సింటర్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే ఫుల్ ప్రొడక్షన్‌తో విశాఖ ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకుంటోంది. ఇలాంటి క్రమంలో మళ్లీ ప్రమాదం జరుగడంతో ప్లాంట్ ఎంప్లాయిస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రమాదాలు జరగడం అనేది అరుదుగా కనిపించదు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి పరిశ్రమకు మరింత ప్రభావం చూపించకుండా ఉండాలంటే, కన్వేయర్ బెల్టుల మరమ్మతులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.