Fire Accident : విశాఖపట్నంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. జైలు రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రధాన శాఖలో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో, స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు, దీంతో.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రాథమికంగా, అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకోవడానికి మొత్తం 3 ఫైర్ ఇంజిన్లను ఫైర్ సిబ్బంది వినియోగించారు. మంటలలో కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్లు కాలిపోయాయినట్లు తెలుస్తోంది. దీపావళి సెలవురోజు కావడంతో, బ్యాంకు సిబ్బంది ఎవరు లేకపోవడం ఆ ప్రమాదానికి మరింత ఆందోళన కలిగించింది.
Gold Mission : లండన్ టు భారత్.. ప్రత్యేక విమానంలో 102 టన్నుల బంగారం.. ఆర్‌బీఐ మెగా మిషన్
మంటలు చెలరేగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపాక అధికారుల ద్వారా వివరాలను వెల్లడిస్తామని చెబుతున్నారు అధికారులు. మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేది, దాని కారణం ఏమిటనేది, లేదా ఇక్కడ కుట్ర కోణం ఉందా అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారని సమాచారం. ప్రజలు ప్రస్తుతానికి సున్నితంగా ఉండాలని, సాక్ష్యాలను తేల్చే వరకు ఏ విధమైన ఊహాగానాలు చేయవద్దని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే.. నిన్న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో, ఉండ్రాజవరం మండలంలోని సూర్యారావుపాలెం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ పిడుగుపాటుకు బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొబ్బరి చెట్టుపైన పిడుగు పడటంతో, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని బాణాసంచా తయారీ ప్రదేశానికి వ్యాపించడంతో, అక్కడ పనిచేస్తున్న పదిమందికిపైగా వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి మధ్య కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది.
ఈ ఘటనపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పండగ సమయానికి ఇటువంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆమె అన్నారు. బాధితుల వైద్య చికిత్సకు సంబంధించి తణుకు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు మెరుగైన వైద్యం అందించాలన్న ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు తహసిల్దార్‌కు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు సంఘటనపై పరిశీలన కొనసాగిస్తున్నారు, బాధితులను తక్షణమే సహాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
Diwali Safety Tips: దీపావళికి టపాసులు కాలుస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!