TDP MLA Arrest: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అరెస్ట్

సీఐడీ ప్రాంతీయ కోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఐడీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును

Published By: HashtagU Telugu Desk
Velgapudi

Velgapudi

సీఐడీ ప్రాంతీయ కోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఐడీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు-ఎమ్మెల్యేకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్‌ చేయడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నర్సీంపట్నంలో టీడీపీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

కాగా ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి అరెస్ట్ వ్యవహరం ఏపీలో కాక రేపుతోంది. ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ ఘటన చర్చనీయాంశమవుతున్న సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం రాజకీయకంగా మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

  Last Updated: 03 Nov 2022, 11:43 AM IST