Site icon HashtagU Telugu

Space Tour: విజయవంతం అయిన తొలి వాణిజ్య యాత్ర.. అంతరిక్షంలోకి ప్రయాణికులు?

Space Tour

Space Tour

ఇక మీదట సాధారణ పౌరులు కూడా అంతరిక్ష యాత్రకు వెళ్లవచ్చు. అది కూడా ఒక ప్రత్యేక విమానంలో.. అదెలా అనుకుంటున్నారా! ఈ దిశగా అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ మొదలుపెట్టిన తొలి వాణిజ్య యాత్ర తాజాగా విజయవంతం అయ్యింది. గెలాక్టిక్‌ 01 పేరుతో చేపట్టిన ఈ యాత్రలో భాగంగా టికెట్‌ కొనుక్కున్న ముగ్గురు ఇటలీవాసులతో పాటుగా ఒక వర్జిన్‌ గెలాక్టిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఇద్దరు పైలట్లు ఏకంగా భూవాతావరణాన్ని దాటి, అంతరిక్షపు అంచుల్లో అలా విహరించి వచ్చారు. కాగా మొదట వీఎంఎస్‌ ఈవ్‌ వాహక నౌక.. వీఎస్‌ఎస్‌ యూనిటీ అనే అంతరిక్ష విమానంతో టెక్సాస్‌ నుంచి టేకాఫ్ తీసుకుంది.

దాదాపు44,500 అడుగుల ఎత్తులో వీఎంఎస్‌ ఈవ్‌ నుంచి ఆ ప్రత్యేక విమానం విడిపోయి ధ్వనికన్నా మూడు రెట్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే దాదాపు 85 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఇలా అంతరిక్ష సరిహద్దుల్లో చేరుకున్న ప్రయాణికులు కొద్ది నిమిషాల పాటు భారరహిత స్థితిని ఆస్వాదించారు. అనంతరం భూవాతావరణంలోకి ప్రవేశించిన ఆ ప్రత్యేక విమానం నేలపై సేఫ్ గా ల్యాండ్‌ అయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్ష పర్యటనకు భారీగా డిమాండ్‌ నెలకొంది. కాగా ఇప్పటికే ఆ సంస్థ దాదాపుగా 800కు పైగా టికెట్లు విక్రయించినట్లు సంస్థ చెబుతోంది.

ఇంతకీ ఒక టికెట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక టికెట్ ధర దాదాపుగా రూ.3.5 కోట్లకు పైమాటే. అయితే ప్రతి ఏటా 400 యాత్రలు నిర్వహించాలన్నది ఈ సంస్థ లక్ష్యం. చాలామంది డబ్బుని చూడకుండా అంతరిక్షం కు వెళ్లాలి అన్న ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ సంస్థ దగ్గరికి ప్రయాణికులు వెళ్లడం కోసం టికెట్లను కొనుగోలు చేయడం కోసం క్యూలు కడుతున్నారు.