Virata Parvam: అద్భుతం.. అద్వితీయం.. విరాటపర్వం!

విరాట పర్వం అనేది మహాభారతంలోని కీలకమైన భాగాలలో ఒకటి.

  • Written By:
  • Updated On - June 9, 2022 / 05:44 PM IST

విరాట పర్వం అనేది మహాభారతంలోని కీలకమైన భాగాలలో ఒకటి. ఇది పాండవులు మరో పన్నెండేళ్లు అడవిలో ఉండేందుకు అజ్ఞాత వనవాసాన్ని తెలియజేస్తుంది. కుట్రలు, రాజకీయాలు అనాడే తత్వశాస్త్రంలో ఉన్నాయి. రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం చిత్రంలో పురాణ ప్రేమకథతో పాటు, పైన పేర్కొన్న అంశాలన్నీ ఉన్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయినప్పటికీ సరైన విడుదల తేదీ కోసం వాయిదా పడింది. దీంతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇతర సినిమాలకు భిన్నంగా ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. నిఖిల్, క్రిష్ జాగర్లమూడి, స్వప్న దత్, మంచు లక్ష్మి మొదలైన దాదాపు 20 మంది ప్రముఖుల సినిమాను చూశారు.

కథ, కథనం, పెర్‌ఫార్మెన్స్‌, టెక్నికల్‌ అంశాలతో విరాటపర్వం ఆకట్టుకోవడంతో విడుదలకు ముందే పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలోని ఎండింగ్ ప్రతిఒక్కరిని ఎమోషన్ కు గురిచేస్తుందట. హీరో నిఖిల్ ట్వీట్ చేస్తూ “ఇప్పుడే #విరాటపర్వం చూశాను. ఇది ఒక ఎపిక్ లవ్ స్టోరీ @Sai_Pallavi92 కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ & @RanaDaggubati అందించిన అద్భుతమైన ప్రదర్శన ఈ సినిమాని వీక్షించేలా చేసింది. హ్యాట్సాఫ్ వేణు సర్ ఈ అద్భుతమైన చిత్రం చాలా బాగుంది”

నిర్మాత స్వప్నా దత్ ఇన్‌స్టాగ్రామ్ లో రియాక్ట్ అయ్యారు. “ఈ మూవీ చూడటం ఆనందంగా ఉంది. @ranadaggubati మీరు ఈ సినిమాతో మరింత ఉన్నతంగా నిలిచారు. @సాయిపల్లవి బాగా చేసింది. @venuudugulafilm మీరు ఒక క్లాసిక్ చేసారు. చిత్రాన్ని థియేటర్లలో చూద్దాం, గొప్ప సినిమాను చిరకాలం జీవించనివ్వండి ”  సినిమాను తిలకించిన సెలబ్రిటీలు రానా, సాయి పల్లవి ఇద్దరూ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ప్రశంసలతో ముంచెత్తారు. మరి సాధారణ ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో అనేది వేచి చూడాల్సిందే!