Virat Kohli Not Out: ఇదేమి అంపైరింగ్.. కోహ్లీ ఔట్‌పై ఫ్యాన్స్ ఫైర్

ప్రస్తుతం ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అంపైరింగ్‌పై విమర్శలు వస్తున్నాయి.

  • Written By:
  • Updated On - February 18, 2023 / 05:34 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ (Delhi) వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అంపైరింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఔటైన తీరు వివాదస్పదమైంది. థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి కోహ్లి బలయ్యాడు. మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి (Virat Kohli) డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా…బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ కోహ్లి ప్యాడ్‌ను తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఆసీస్‌ ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్‌ చేశారు.

ఈ క్రమంలో ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో విరాట్ (Virat Kohli) రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ చాలాసేపు రీప్లేను పరిశీలించాడు. కోహ్లి బ్యాట్‌కి ముందుగా బాల్ తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అంపైర్‌ నిర్ణయాన్ని స్క్రీన్‌పై చూసిన కోహ్లి కూడా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్‌కు వెళ్ళాడు.

కోహ్లి ఔట్‌ నిర్ణయంపై టీమిండియా (Team India) మాజీ ఆటగాళ్లు అభినవ్‌ ముకుంద్‌, వసీం జాఫర్‌తో పాటు పలువురు మాజీ ఆటగాళ్ళు మండిపడ్డారు. అటు ఫ్యాన్స్ కూడా అంపైరింగ్‌పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. థర్డ్ అంపైర్ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఫ్యాన్స్‌ కూడా థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై మండిపడుతున్నారు. చెత్త అంపైరింగ్‌.. కళ్లు కనిపించడం లేదా! అది నాటౌట్‌ అంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ  (Virat Kohli) 84 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేసాడు.

Also Read: IND Vs Australia: 262 పరుగులకు ఇండియా ఆల్ ఔట్.. అక్షర్ పటేల్.. అశ్విన్‌తో కలిసి శతక భాగస్వామ్యం!