Virat Kohli: చిన్ననాటి కోచ్‌ పాదాలు తాకిన విరాట్

అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్‌ను కలిశాడు. కోహ్లీ తన కోచ్‌కు పూర్తి గౌరవం ఇస్తూ గ్రౌండ్ మధ్యలో వంగి అతని పాదాలను తాకాడు

Virat Kohli: అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్‌ను కలిశాడు. కోహ్లీ తన కోచ్‌కు పూర్తి గౌరవం ఇస్తూ గ్రౌండ్ మధ్యలో వంగి అతని పాదాలను తాకాడు. అంతేకాదు కోచ్‌ని కౌగిలించుకుని అతనితో కలిసి ఫోటో దిగాడు విరాట్. తన చిన్ననాటి కోచ్‌ని కలిసిన తర్వాత కోహ్లీ కూడా చాలా సంతోషంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో క్రికెట్ అభిమానులు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంత ఎదిగిన ఒదిగే గుణం కోహ్లీది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ తన 12వ పరుగు చేసిన వెంటనే ఈ ప్రత్యేక స్థానాన్ని సాధించాడు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ పేరు మీద నమోదైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 6,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కూడా కోహ్లీ నిలిచాడు. ఫార్మేట్ ఏదైనా కోహ్లీ ఖాతాలో రికార్డులు ఉండాల్సిందే. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌ అని తేడా లేకుండా రికార్డులు తన పేరుపై లిఖించుకుంటూ పోతున్నాడు. ఈ మధ్య కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో కోహ్లీ వీరబాదుడు బాదుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్ లో దంచి కొడుతున్నాడు.

Read More: Virat Kohli: కోహ్లీ IPL @700