GT vs LSG: ‘వాట్ ఎ ప్లేయర్’ అంటూ వృద్ధిమాన్ పై కోహ్లీ ప్రశంసలు

ఐపీఎల్ 2023లో 51వ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది.

GT vs LSG: ఐపీఎల్ 2023లో 51వ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం లభించింది. జట్టు తరఫున ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్ మధ్య అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యం ఉంది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో సాహా విధ్వంసక ఇన్నింగ్స్‌ను చూసిన ఆర్‌సిబి స్టార్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీ బాగా వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో, వృద్ధిమాన్ సాహా 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేట్ వద్ద సాహా అద్భుతంగా బ్యాటింగ్ చేసి గుజరాత్ జట్టుకు శుభారంభం అందించాడు. విరాట్ కోహ్లి కూడా అతని ఇన్నింగ్స్ చూసి చాలా హ్యాపీగా కనిపించాడు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పంచుకున్నాడు, అందులో అతను సాహాను ప్రశంసిస్తూ -‘వాట్ ఎ ప్లేయర్’.అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో క్షణాల్లో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి గుజరాత్ టైటాన్స్‌కు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్ గట్టి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ వేగంగా పరుగులు చేయడంతో 6 ఓవర్లలో జట్టు వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు, ఇది ఈ సీజన్‌లో అతనికి మొదటి అర్ధ సెంచరీ. శుభ్‌మన్ మరియు సాహా మధ్య 142 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా (సి), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, స్వప్నిల్ సింగ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్

Read More: GT vs LSG: సాహు… వృద్ధిమాన్.. 20 బంతుల్లో 50