SRH vs RCB: ఐపీఎల్ 2023 సీజన్లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో కోహ్లీ అనేక ఫీట్లు సాధించాడు. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత సాధించాడు.
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ 7500 పరుగులు పూర్తి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ ఫీట్ సాధించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 187 పరుగుల ఛేజింగ్‌లో ఆర్సీబీ ఓపెనర్స్ విరాట్ కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లకు చమటలు పట్టించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రత్యేక మైలురాయిని సాధించాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున 7500 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసీ ఆర్‌సీబీ జట్టుకు శుభారంభం అందించారు. మూడో ఓవర్లో కెప్టెన్ డుప్లెసీ పరుగుల వరద పారించాడు.
Virat Kohli completed 7500 runs for RCB [IPL + CLT20]
First player in the history for a team.
The Man, The Myth, The legend. pic.twitter.com/22c8iP3MeP
— Johns. (@CricCrazyJohns) May 18, 2023
13 ఓవర్ నాటికి ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 13 ఓవర్ నాటికి విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 65 పరుగులు 8 ఫోర్లు, 2 సిక్సులు చేస్తే.. ఫాఫ్ డుప్లెసీ 39 బంతుల్లో 69 పరుగులతో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో సత్తా చాటాడు.
Read More: SRH vs RCB: హెన్రిచ్ క్లాసెన్ సూపర్ సెంచరీ.. SRH లో ఆ నలుగురు