Site icon HashtagU Telugu

Virat Kohli: కోహ్లీ IPL @700

Virat Kohli

628702e401037

Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో భారీ మైలురాయిని అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ 12 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ తన 12వ పరుగు చేసిన వెంటనే ఈ ఘనత సాధించాడు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ పేరు మీద ఉండటం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 6,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కూడా కోహ్లీ నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో కోహ్లీ తర్వాత శిఖర్ ధావన్ పేరు ఉంది. ఈ లీగ్‌లో ధావన్ 6,536 పరుగులు చేశాడు. కోహ్లీ, గబ్బర్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహిస్తున్న డేవిడ్ వార్నర్ పేరు ఈ జాబితాలో చేరింది. వార్నర్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 6,189 పరుగులు చేశాడు. అదే సమయంలో రోహిత్ శర్మ 6063 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Read More: CSK vs MI: అమిత్ మిశ్రా రికార్డును బద్దలు కొట్టిన పీయూష్