Site icon HashtagU Telugu

Kohli: కోహ్లీ @ 8000

Kohli New

Kohli New

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక టీమిండియా యాజి కెప్టెన్ విరాట్‌ కోహ్లి తన టెస్ట్‌ కెరీర్‌లో 100వ మ్యాచ్‌ ఆడనున్నాడు. . అయితే హోరాహోరీగా సాగుతున్న ఈ తొలి టెస్టుమ్యాచు లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి 38 ప‌రుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు చేసిన ఐదో టీమిండియా ఆటగాడిగా రికార్డు సాధించాడు…

ఇప్పటి వరకూ తన కెరీర్ లో 99 టెస్టులాడిన విరాట్ కోహ్లీ 168 ఇన్నింగ్స్‌ల్లో 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.. అయితే టెస్టుల్లో వేగంగా 8 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న టీమిండియా ప్లేయర్ల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కేవలం 154 ఇన్నింగ్స్‌ల్లోనే 8,000 పరుగులు చేయగా.. ఆ తర్వాత టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ 158 ఇన్నింగ్స్‌ల్లో, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 160 ఇన్నింగ్స్ లో ఈ ఘనతను సాధించారు..

ఇదిలాఉంటే.. తన కెరీర్ లో 100వ టెస్టు ను ఆడుతున్న కోహ్లీ 71వ అంతర్జాతీయ ఆటగాడిగానే కాకుండా టీమ్‌ఇండియా తరఫున 12వ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకమైన జ్ఞాపికతో పాటు వందో టెస్టు క్యాప్​ను అందజేశాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జరిగిన ఈ వేడుకలో కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా పాల్గొన్నారు.

Exit mobile version