ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ లో గిల్, కోహ్లీ దూకుడు.. కెప్టెన్ రోహిత్ వెనక్కి!

ర్యాకింగ్స్ లో శుభ్‌మాన్ గిల్ 5వ ర్యాంక్‌లో ఉండగా, తర్వాత విరాట్ కోహ్లీ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.

  • Written By:
  • Updated On - March 29, 2023 / 05:26 PM IST

బుధవారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను (ICC ODI Rankings) ప్రకటించింది. ర్యాకింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకి 8వ స్థానానికి చేరుకోగా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 10 స్థానాలు ఎగబాకి 76వ స్థానంలో నిలిచాడు. శుభ్‌మాన్ గిల్ 5వ ర్యాంక్‌లో భారత అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. చెన్నై ODIలో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) 7వ స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాటింగ్‌ లో పాకిస్థాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ నెంబర్ 1లో ఉన్నాడు. ఇక 10 బౌలర్ల జాబితాలో (ICC ODI Rankings) మహమ్మద్ సిరాజ్ మూడో స్థానంలో కొనసాగుతుండటం విశేషం.

ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ షార్జాలో పాకిస్తాన్‌పై 2-1తో సిరీస్ విజయానికి నాయకత్వం వహించిన తర్వాత T20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. తన 12 ఓవర్లలో మొత్తం 62 పరుగులిచ్చి మూడు మ్యాచ్‌ల్లో ఒక్కో వికెట్ తీసిన రషీద్, శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగను అధిగమించి బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. రషీద్ తన కెరీర్‌లో మొదటిసారి ఫిబ్రవరి 2018లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత ఏడాది నవంబర్‌లో (ICC ODI Rankings) నంబర్ వన్‌గా నిలిచాడు.

మొదటి, మూడో మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు తీసిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ 10వ స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకిన మరో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ కాగా, ఈ సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ ఫజల్‌హాక్ ఫరూఖీ ఐదు వికెట్లు పడగొట్టడంతో కెరీర్‌లో అత్యుత్తమంగా 12 స్థానాలు ఎగబాకాడు. ODI ర్యాంకింగ్స్‌లో, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా చెన్నైలో భారత్‌తో జరిగిన మూడో గేమ్‌లో 45 పరుగులకు నాలుగు వికెట్లు సాధించి మ్యాచ్ విన్నింగ్ తర్వాత మూడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 6వ స్థానానికి చేరుకున్నాడు. ఇక సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మిచెల్ మార్ష్ మొత్తం 194 పరుగులు సాధించడంతో 51వ స్థానానికి  (ICC ODI Rankings) చేరుకున్నాడు.

Also Read: Corona Report: భయపెడుతున్న కరోనా.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు!