Site icon HashtagU Telugu

Amazon Parcels Thrown: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పార్సిల్స్ ఇష్టారాజ్యంగా విసిరేస్తున్నారు.. క్లారిటీ ఇచ్చేసిన అమెజాన్!!

Train Imresizer (1)

Train Imresizer (1)

అమెజాన్, ఫ్లిప్ కార్ట్లలో వస్తువుల ఆన్ లైన్ బుకింగ్ ఇప్పుడు కామన్.

తాము ఇచ్చిన ఆర్డర్ కోసం కష్టమర్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు.

అయితే ట్రైనులో వచ్చే ఆ పార్సిల్ గతి ఎలా ఉంటుందో .. పార్సిల్ ను ఏయే యాంగిల్స్ లో విసురుతారో
తెలియాలంటే ఈ వీడియోను మీరు చూడాల్సిందే.

అది అసోంలోని ఒక రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌. దానిపై పోర్టర్లు  అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ప్యాకేజీలను విసిరిపారేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పార్సిల్స్ పరిస్థితి ఇదీ అంటూ ట్విటర్‌లో ఈ వీడియో బాగా షేర్‌ అయింది.న్యూఢిల్లీ- దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12424) ద్వారా ఈ పార్సిల్స్ వచ్చాయని గుర్తించారు. 2022   మార్చి 14న ఈ విజువల్స్ రికార్డయ్యాయట. ఈ వీడియోపై  ఆన్‌లైన్‌ రీటైలర్‌  అమెజాన్‌ స్పందించింది. వీడియోలోని దృశ్యాలు వాస్తవమైనవే అయినా, ఇది పాత వీడియో ..దీనిపై ఇప్పటికే  చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. కస్టమర్లకు నాణ్యమైన వస్తువులను అందించడమే తమ లక్ష్యమని  అమెజాన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

రైల్వేస్ ఏం చెప్పింది?

ఈ వీడియోలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పార్సిల్స్ ను ఇష్టం వచ్చినట్లుగా పారేస్తున్న వాళ్ళు భారతీయ రైల్వే సిబ్బంది కాదని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే తేల్చి చెప్పింది.
“పార్సెల్స్‌ను నిర్వహించే వ్యక్తులు పార్శిల్ వ్యాన్‌ను లీజుకు తీసుకున్న పార్టీ  ఎంపిక చేసుకుంటుందనీ  తెలిపింది..   దీని  ప్రకారం, వారి క్లయింట్  పార్శిల్‌లను SLR/పార్శిల్ వ్యాన్‌ల నుంచి లోడ్ చేయడం/అన్‌లోడ్ చేయడం వారి బాధ్యతే” అని స్పష్టం చేసింది.