Site icon HashtagU Telugu

Viral Video: ట్రాఫిక్ ఎంత ఉంటే అంత రోడ్.. డివైడర్ ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు?

Dividers

Dividers

పెద్ద పెద్ద మహానగరాల్లో ప్రతిరోజు ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఉదయం సాయంకాలం అయ్యింది అంటే చాలు కిలో మీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే నగరాల్లోని ప్రజలు బయటికి వెళ్లాలి అంటేనే భయపడుతూ ఉంటారు. ఆ ట్రాఫిక్ లో చిక్కుకొని బయటపడాలి అంటే అదొక చిన్నపాటి యుద్ధమే అని చెప్పవచ్చు. అయితే వాహనదారుల సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా చైనా ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది.

చైనాలో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి చైనా వారు ఒక సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నప్పుడూ క్లియర్‌ చేసేందుకు ఒక రివర్సబుల్‌ లేన్‌ పని తీరు చూపిస్తుంది. రోడ్డు మధ్యలో ఉండే డివైడర్‌ వెడల్పును కావల్సినట్లుగా ఎడ్జెస్ట్‌ చేసుకుంటూ ట్రాఫిక్‌ని తగ్గించడమే. అయితే చైనా వాసులు ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఉదయం ఒక దిశలోనూ సాయంత్రం సమయాల్లో వ్యతిరేక దిశలో వెళ్తారు.

 

అందుకోసం ఆయా దిశల్లో వెళ్లేలా డివైడర్‌ లైన్‌ని సెట్‌ చేసేకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ మేరకు ఆ వీడియోలో ఆ డివైడర్‌ లైన్‌ని ట్రాఫిక్‌ కోసం జిప్‌ మాదిరిగా రెండు వాహనాల సాయంతో దగ్గరగా చేయడం కనిపిస్తుంది.