Site icon HashtagU Telugu

Watch Video: వాహనదారుడా.. ఏమిటి ఈ సాహసం?

Viral

Viral

ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఆంక్షలు అమలు చేస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ప్రవేశపెడుతున్నా.. జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మొబైల్ మాట్లాడుతూనో.. చాటింగ్ చేస్తూనో.. డ్రైవింగ్ చేస్తున్నారు. విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కించిత్తు కూడా మార్పు రావడం లేదు. దీంతో హైదరాబాద్ సిటీ పోలీసులు పలు వీడియోలను షేర్ చేస్తూ అవేర్ నెస్ తీసుకొస్తున్నారు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ‘‘ఓ ద్విచక్ర వాహన చొదకా…ఏమిటి ఈ సాహసం? ఈ చర్య ద్వారా సమాజానికి నువ్వు ఇచ్చే సందేశం ఏమిటి? విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ప్రయాణించడం నీకు తగునా.. పట్టు తప్పావో ఊహకందని పరిణామం నీ సొంతం. రోడ్డు భద్రతా నియమాలు పాటిద్ధాం.. సురక్షితంగా మన గమ్య స్థానాలను చేరుకుందాం’’ అంటూ రియాక్ట్ అయ్యారు ట్రాఫిక్ పోలీసులు.

Exit mobile version