Dudhsagar Falls : సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం..ఎక్క‌డుందో తెలుసా..?

భార‌త‌దేశంలో అంద‌మైన ప్ర‌దేశాలు, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌లిగించే ప్రాంతాలు చాలా ఉన్న‌వి. అందులో ఒక‌టి దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం

  • Written By:
  • Publish Date - July 21, 2022 / 11:04 PM IST

భార‌త‌దేశంలో అంద‌మైన ప్ర‌దేశాలు, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌లిగించే ప్రాంతాలు చాలా ఉన్న‌వి. అందులో ఒక‌టి దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం. ఈ జ‌ల‌పాతం వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ అద్భుతమైన వైరల్ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గోవాలోని దూద్‌సాగర్ జలపాతం వీడియోని చూస్తే అక్క‌డి వెళ్లి తీరాల్సిందేన‌నిపిస్తుంది. ఈ వవఈడియోకి దాదాపు 7 లక్షల వ్యూస్ కలిగి ఉంది. గోవాలోని మండోవి నదిపై ఉన్న జలపాతం గుండా రైలు కూడా వెళ్లింది. వర్షాకాలం కారణంగా దట్టమైన పచ్చదనం, పొగమంచు నేపథ్యంలో ప్రవహించే నీరు ఉంటుంది. నెటిజన్లు జలపాతాల అందాలకు ఎంతగానో ఆకర్షితులవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా త‌మ‌కు న‌చ్చిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు.