Site icon HashtagU Telugu

Viral Video: వామ్మో.. ఈ వీడియో చూస్తే చమటలు పట్టేస్తాయ్.. ఒక్క ఏనుగుపై 14 సింహాల భయంకర దాడి!

Viral Video

Viral Video

అడవిలో పెరిగే జంతువులలో సింహం అతి భయంకరమైనదిగా చెప్పుకోవచ్చు. అందుకే అడవికి సింహాన్ని రాజు అని పిలుస్తూ ఉంటారు. సామాన్యంగా అడవిలో ఉంటే ఏ జంతువులు కూడా సింహంతో పోటీకి వెళ్లడానికి సాహసించవు. కాగా సింహాలకు అడవిలో పొరపాటున ఏ జంతువు కనిపించిన దానిని వింటాడి మరి తింటూ ఉంటాయి. అయితే సింహాలు ఎక్కువగా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. ఈ గుంపులకు ఒకటి లేదంటే రెండు సింహాలు న్యాయకత్వం వహిస్తూ ఉంటాయి. అవి ఉన్న ప్రదేశంలో రాజులా ఉంటూ,ఇతర సింహాల గుంపును వాటి పరిధిలోకి రావడానికి అవి ఇష్టపడవు.

అయితే సింహాలు ఇతర జంతువులను వేటాడినట్టుగా ఏనుగులను వేటాడ లేవు. ఎందుకంటే ఏనుగులు కూడా గుంపులు గుంపులుగా ఉంటాయి. అంతేకాకుండా ఒక ఏనుగు కి ఏదైనా ప్రమాదం జరిగితే అన్ని కలిసికట్టుగా వాటిపై దాడి చేస్తూ ఉంటాయి. అంతే కాకుండా ఏనుగులు వాటిపై దాడి చేయడానికి వచ్చిన వాటిని తొండం లేదా కాళ్ళతో విసిరేస్తూ ఉంటాయి. అయితే తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక చిన్న ఏనుగు అనుకోకుండా వాటి గుంపునుంచి తప్పిపోయి నీటిని తాగడానికి నీటి వద్దకి వచ్చింది.

 

ఆ సమయంలో మంచి ఆకలి మీద ఉన్న సివంగీల కంట పడింది. అప్పుడు దాదాపుగా 12 కు పైగా ఉన్న ఆ ఆడ సింహాల గుంపు ఆ ఏనుగు పై దాడి చేయడం మొదలు పెట్టాయి. అలా ఒక్కొక్కటిగా ఆ సింహాలు ఏనుగు పై దాడి చేయడానికి ప్రయత్నించగా ఏమాత్రం భయపడకుండా గట్టి గట్టిగా అరుస్తూ తొండంతో వాటిని కొడుతూ వాటిని భయపెడుతూ దూరంగా తరిమేసింది. అయినా కూడా ఆ సింహాలు మళ్లీ అటాక్ చేయడానికి ప్రయత్నించగా కొద్ది ముందు వరకు వెళ్లిన ఆఏనుగు మళ్ళీ వచ్చి వాటిని దూరం తదిమేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.