Fastest Wheel: వామ్మో.. కారు వెళుతూ ఉండగానే టైర్ మార్చేసిన వ్యక్తి.. వీడియో వైరల్?

సాధారణంగా మనం పని మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా దూర ప్రయాణాలు చేసినప్పుడు టైర్ పంచర్ అయితే

  • Written By:
  • Publish Date - July 24, 2022 / 07:30 AM IST

సాధారణంగా మనం పని మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా దూర ప్రయాణాలు చేసినప్పుడు టైర్ పంచర్ అయితే వెంటనే స్టెఫిని బిగిస్తారు. ఒకవేళ స్టెఫిని అందుబాటులో లేకపోతే ఆ కష్టాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇక సమీపంలో పంచర్ షాపులు లేకపోతే వారి కష్టాలు వర్ణనాతీతం అని చెప్పవచ్చు. అయితే సాధారణంగా ఏదైనా వెహికల్ కి టైర్ మార్చాలి అంటే చాలా సమయం పడుతూ ఉంటుంది. అయితే కొంతమంది ఎక్స్పీరియన్స్ వల్ల తొందర తొందరగా పని పూర్తి చేస్తూ ఉంటారు. అయితే టైర్ మార్చాలి అంటే తప్పనిసరిగా ఆ వీక్ ని ఒకచోట నిలబెట్టి దానికి సపోర్ట్ గా పెట్టి ఆ తర్వాత ఆ టైర్ ని మారుస్తూ ఉంటారు.

కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం ఒక వ్యక్తి ఏకంగా కారు వెళుతూ ఉండగా టైర్ తీసి వెంటనే మరొక టైర్ ని ఫిక్స్ చేశాడు. అయితే కారు వెళుతుండగా టైర్ బిగించడం అనేది ఊహించుకుంటేనే భయమేస్తోంది. అలాంటిది ఒక వ్యక్తి మాత్రం కారు వెళ్తూ ఉండగానే టైరును అవలీలగా మార్చేశాడు. అతని టాలెంట్ కి నెటిజన్స్ అందరూ ఫిదా అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇటలీలో జరిగిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు షోలో ఇద్దరు ఇటాలియన్‌ వ్యక్తులు కదులుతున్న వాహనంలో ఉండే టైరు మార్చి రికార్డు సృష్టించారు.

అదీ కూడా చాలా వేగంగా ఒక నిమిషం 17 సెకన్ల వ్యవధిలో మార్చేశారు. అయితే ఈ వీడియోని చూసినవారు ఆశ్చర్య పోవడంతో పాటు ఆ ఇద్దరు వ్యక్తులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మేరకు మాన్యయోల్‌ జోల్డాన్‌ అనే వ్యక్తి కారుని డ్రైవ్‌ చేస్తుండగా జియాన్లుకా ఫోల్కో కారు వేగంగా కదులుతుంటే కారు కిటికిలోంచి వేలాడుతూ టైరు మార్చేశాడు. మునపటి రికార్డును బ్రేక్‌ చేసి మరీ అత్యంత వేగవంతంగా కారు టైరుని మార్చేశాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని చూడడంతో పాటు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.