Site icon HashtagU Telugu

Smart Dog @ Work: ఈ డాగ్ సో స్మార్ట్.. వైరల్ అవుతన్న వీడియో!

Dog

Dog

బట్టలు ఉతకడం, ఆరేయడం, పద్దతిగా సర్దేయడం చాలామందికి చిరకుగ్గా ఉంటుంది. సాయం చేయడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అని చాలాసార్లు అనిపిస్తుంటుంది కూడా. కానీ చిన్న పనులకే ఎవరిని సాయం అడగలేం. కానీ ఎలాంటి సాయం అడగకుండానే ఓ కుక్క సాయం చేస్తుంది. బట్టలు తీయడం, బకెట్ లో వేయడం లాంటివి చేస్తూ తన చేష్టలతో ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మేరీ అనే మహిళ ఆస్ట్రేలియన్ షెపర్డ్ అనే డాగ్ ను పెంచుకుంటుంది. ఆమెకు చిన్న చిన్న పనులు చేస్తూ సాయంగా ఉంటోంది. ఆమె వాషింగ్ మిషీన్ డోర్స్ ఓపెన్ చేయగా, డాగ్ బట్టలను నోటితో లాగి బకెట్ లో వేస్తోంది. అంతేకాదు.. హ్యాంగర్స్ పై బట్టలను కూడా తగిలిస్తోంది. ప్రస్తుతం డాగ్ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్స్ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.

https://twitter.com/PuppiesIover/status/1545074844890324993?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1545074844890324993%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fviral-video-happy-kind-dog-helps-woman-with-laundry-gives-her-high-five-cute-animal-video-5501472%2F

Exit mobile version