Site icon HashtagU Telugu

Watch Video: ఈ చిరుత సో కూల్.. వైల్డ్ లైఫ్ వీడియో వైరల్!

Cheetah

Cheetah

జంతు ప్రేమికులు తరచుగా వైల్డ్ లైఫ్ పార్కులను విజిట్ చేయడానికి ఇష్టం చూపుతుంటారు. జంతువులను దగ్గరగా చూస్తూ.. వాటితో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి షాక్ కు గురిచేసే ఘటనలు కూడా జరుగుతుంటాయి. జాతీయ నేషనల్ పార్క్ ను సందర్శించిన  జంతు ప్రేమికులకు ఓ చిరుత ఝలక్ ఇచ్చింది. ప్రస్తతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జంతు ప్రేమికులు కొందరు టాంజానియా సెరెంగేటి జాతీయ ఉద్యానవనంలో పర్యటించారు. వివిధ రకాల జంతువుల చూస్తుండగా ఓ చిరుత సడన్ గా వారి వాహనంపైకి దూకింది. మొదట వాహనం టైర్లపైకి ఎక్కి ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏకంగా జీపు టాప్ పైకి వెక్కి భయాభ్రాంతులకు గురిచేసింది. అయితే చిరుత టూరిస్టులకు ఎటువంటి ముప్పు కలిగించదు. చిరుత చాలా ఫ్రెండ్లీగా మూవ్ కావడంతో టూరిస్టులు ఫొటోలు తీసుకొని బాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. చిరుత చాలా కూల్ గా ఉంది అంటూ కొందరు, చిరుత మంచి మూడ్ లో ఉంది అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version