Video Viral: అన్న, చెల్లెల బాండింగ్ చూస్తే ముచ్చటేస్తోంది.. వీడియో వైరల్?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రపంచం

  • Written By:
  • Publish Date - December 8, 2022 / 10:03 PM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రపంచం నలుమూలలా ఏది జరిగినా కూడా కొద్ది క్షణాల్లోనే అది వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా నిత్యం పదుల సంఖ్యలో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఆ వీడియోలలో కొన్ని నవ్వులు పూయించేవిగా ఉంటే మరికొన్ని బాధ కలిగించేవిగా ఉంటాయి. ఎక్కువగా సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు అలాగే రిలేషన్ కి సంబంధించిన వీడియోలు పక్షులు జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో మూగజీవాలకు అలాగే పిల్లలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.

మూగ జంతువులు చేసే పనులు అలాగే చిన్నపిల్లలు చేసే చిలిపి చిలిపి అల్లర్లకూ సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మన ఇళ్లల్లో అక్క తమ్ముడు లేదా అన్నా చెల్లెలి ఉంటే వారి మధ్య గొడవలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. కొట్టుకోవడం తన్నుకోవడం ఒకరిపై ఒకరు అరుచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం అన్నా చెల్లెలు ఇంత ప్రేమగా ఉంటారా అని అనిపిస్తోంది. అంతేకాకుండా ఆ వీడియోలో అన్నా చెల్లెలి మధ్య బాండింగ్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి కూర్చుని స్నాక్స్ తింటూ ఉంటారు. అయితే ఆ అన్నా, చెల్లెలు ఇద్దరు కూడా చిన్నారులే. అప్పుడు అన్నా మొబైల్ ఫోన్ చూస్తూ అందులో లీనం అయిపోయి అక్కడ ఆహారం ఉందో లేదో కూడా తెలియనంత బిజీ బిజీగా ఉన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అక్కడే ఉన్న ఒక బిస్కెట్ ముక్క కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో పక్కనే ఉన్న ఆ పిల్లవాడి చెల్లె లు దానిని తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ అక్కడే పెట్టడంతో వెంటనే ఆ పిల్లవాడు మొబైల్ చూసుకుంటూ ఆ ముక్కను మళ్ళీ తన చెల్లికి ఇస్తాడు. అప్పుడు చెల్లి ఒక్కసారిగా సంతోషించి ప్రేమతో తన అన్నయ్యకు బుగ్గ మీద ముద్దు పెట్టడంతో బాలుడు కూడా తన చెల్లి వైపు సంతోషంగా చూస్తాడు. ఆ వీడియో చూడడానికి ఎంతో క్యూట్ గా చూడముచ్చటగా అనిపిస్తోంది.