సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఆ ఇంట్లో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ చిన్న పిల్లలు తెలిసి తెలియక చేసే కొన్ని పనులు పెద్దలకు నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి. అలాగే ఆ చిన్న పిల్లలు మాట్లాడటం, నవ్వటం ఇలా ఏది చేసినా కూడా పెద్దలకు ముద్దుగా ఉంటుంది. అలా ఇంట్లో పిల్లలు ఉండే సందడి సందడిగా ఆనందంగా ఉంటుంది. అలాగే ఆ పిల్లలకు ఏమైనా కావాలి అంటే దానిని తీసి ఇచ్చే వరకు గోమూ చేస్తూ ఉంటారు. అలా గోము చేయడం కూడా పెద్దలకు సరదాగా ఉంటుంది. ఆ పిల్లలు చేసే చిలిపి చిలిపి పనులు అల్లరిని చూసి ఆ కన్నతల్లి మురిసిపోతూ ఉంటుంది.
అయితే కన్నతల్లి ప్రేమ అన్నది కేవలం మనుషుల వరకు మాత్రమే కాదు జంతువుల పట్ల కూడా ఉంటుంది అన్న విషయాన్ని నిరూపిస్తూ ఎప్పటికీ ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని రకాల వీడియోలు తల్లి ప్రేమను అలాగే కన్నబిడ్డ ప్రేమను తెలిపే విధంగా కూడా ఉంటాయి. ఉదాహరణగా తీసుకుంటే ఏదైనా జంతువులు కానీ పక్షులు కానీ వాటి పిల్లలకు ఇతర పక్షులు జంతువుల నుంచి హాని ఉంది అని తెలిస్తే వాటి ప్రాణాలకు తెగించి మరీ వాటి బిడ్డలను కాపాడుకుంటూ ఉంటాయి.
Baby throwing tantrums on getting frustrated…
Relatable☺️☺️
VC:Fascinating pic.twitter.com/9YSvTCGTl9— Susanta Nanda (@susantananda3) September 28, 2022
కొన్ని కొన్ని సార్లు ఆ మూగజీవులు వాటి బిడ్డల కోసం అవతలి జీవులకు ఆహారం కూడా అవుతూ ఉంటాయి. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలలో ఎక్కువగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఏనుగులకు సంబంధించిన ఎటువంటి వీడియోలు అయినా సరే కొద్ది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. కాగా తాజాగా అలాంటి వీడియోని ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో నెటిజెన్స్ కీ తెగ నవ్వులు పూయిస్తోంది. ఆ వీడియోలో ఏముంది అన్న విషయానికి వస్తే.. అడవిలో రోడ్డు పక్కన ఒక తల్లి ఏనుగు చిన్న పిల్ల ఏనుగు వెళ్తున్నాయి. ఇంతలోనే ఆ చిన్న ఏనుగు కావాలని రోడ్డు మీద పడిపోయి గోము చేస్తోంది. కానీ ఆ తల్లి ఏనుగు పట్టించుకోలేదు. కాగా ఆ చిన్న ఏనుగు కిందపడి తన తల్లి చూడాలని గిలగిలా కొట్టుకోవడం నెటిజన్స్ కి నవ్వులు తెప్పిస్తోంది.