Site icon HashtagU Telugu

Viral Video: గోల్డ్ చైన్ ను ఎత్తుకెళ్లిన చీమలదండు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral

Viral

చీమలే కదా.. అని మనం తేలిగ్గా తీసిపారేస్తాం. కానీ ఆ చీమలన్నీ ఒక్కటైతే ఏదైనా సాధ్యమే అని చెప్పక తప్పదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. భారీ వస్తువులను ఎత్తడం చీమలకు కొత్తేమీ కాదు. చీమలు బంగారు గొలుసును తీసుకువెళుతున్న వీడియో ఒకటి ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో నల్ల చీమలన్నీ బంగారు గొలుసు చుట్టూ చేరి ఇంకో చోటుకు తరలిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ హవ్వా అని నోరెళ్లబెట్టారు. “బంగారం స్మగ్లర్లు. IPCలోని ఏ సెక్షన్ కింద చీమలపై కేసు బుక్ చేయవచ్చు? కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. 143,000 కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి ఫన్నీగా సమాధానమిచ్చాడు. ముందుగా చీమల్లో ఆడ, మగవాటిని గుర్తించాలి. వాటికి జీవించే హక్కు ఉంది. బంగారు చైన్ దొంగిలించినమాత్రానా కేసు బుక్ చేయాల్సిన అవసరం లేదు. పోలీసులకు సమాచారం ఇద్దామని రియాక్ట్ అయ్యాడు.

 

 

Exit mobile version