Site icon HashtagU Telugu

Hanuman Jayanti Violence: ఢిల్లీలో హనుమాన్ జయంతి ర్యాలీలో హింస.. గాయ‌ప‌డ్డ పోలీసులు

hanuman jayanti

hanuman jayanti

ఢిల్లీలో హునుమాన్ జ‌యంతి శోభాయాత్ర‌లో హింసాకాండ చెల‌రేగింది. ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో పలు వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికక్కడే పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా, వారిపై కూడా దుండగులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఊరేగింపుపై రాళ్లు రువ్వినట్లు పోలీసులు వెల్ల‌డించారు. మరోవైపు రాళ్లదాడి ఘటనను ‘ఉగ్రదాడి’గా బీజేపీ నేత కపిల్ మిశ్రా అభివర్ణించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీలో పోలీస్ భ‌ద్ర‌త‌ను పెంచారు.