Vinod Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద విమర్శలు చేసి జాతీయ రహదారికి సంబంధించిన ఎక్సటెన్షన్ కోసం ప్రయత్నించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వంవైపు కొన్ని హామీలు ఇచ్చినట్టు తెలిపారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ రహదారి 365 సూర్యాపేట నుంచి దుద్దెఢ వరకు ఉండాలని, దుద్దెఢ నుంచి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు విస్తరించాలని ప్రతిపాదనలు చేశామన్నారు. “కోరుట్ల నుండి దుద్దెఢ వరకు రహదారి వెన్ను పూస లాగ ఉండేలా ప్రతిపాదించాం” అని ఆయన పేర్కొన్నారు.
CM Chandrababu : మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారం.. సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం
సిరిసిల్ల నుంచి పాములాగా రహదారి వేస్తున్నారని, దానిని వెంటనే విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “సిరిసిల్లలోని మధ్య తరగతి ప్రజలు రహదారిలో జాగలు కోల్పోతున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే లైన్ ఎలా వస్తుందో, దాని పక్కన రహదారిని వేయాలని, రాజమండ్రి వంటి తెలంగాణలో రైల్వే కం బ్రిడ్జి నిర్మాణం చేయాలని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి తెలంగాణకు అన్యాయం జరిగిందని, హైదరాబాద్ నుండి విజయవాడ, ఆర్మూరు నుండి జాగ్దేవ్ పూర్ వరకు రెండు రహదారులు రావడం జరుగుతుందని చెప్పారు. “రెండు జాతీయ రహదారుల ఎక్టెన్షన్ కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో మాట్లాడాలి” అని ఆయన సూచించారు.
“రహదారి విస్తరణ జరుగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం” అని వినోద్ కుమార్ హెచ్చరించారు. “మంచి రోడ్డు లేకపోతే మనమే నష్టపోతాం” అని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, భూములు కోల్పోయిన వారికి రెట్టింపు పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మొత్తం పరిస్థితిని బట్టి, రాష్ట్ర రవాణా వ్యవస్థకు మెరుగులు చేకూర్చడం కోసం ప్రాధమిక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Complaint Against Madhav: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు