Wrestlers Protest: కేంద్ర మంత్రిపై మహిళ రెజ్లర్ సెన్సేషన్ కామెంట్స్

రెజ్లర్లను లైంగికంగా వేధించినందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత నెల 23 నుంచి ప్రముఖ రెజ్లర్లు నిరసన

Wrestlers Protest: రెజ్లర్లను లైంగికంగా వేధించినందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత నెల 23 నుంచి ప్రముఖ రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తోటి రెజ్లర్లతో కలిసి ధర్నాకు దిగారు. రెజ్లర్ల నిరసనకు ప్రముఖ పార్టీలు సంఘీభావం తెలిపాయి.

డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్ మరియు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న భారత అగ్రశ్రేణి మహిళ రెజ్లర్ వినేష్ ఫోగట్ తాజాగా మీడియాతో మాట్లాడారు. పలుకుబడి ఉన్న వ్యక్తులపై వ్యతిరేకంగా పోరాడటం అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు ఆమె. భూషణ్ శరణ్ చాలా కాలంగా తన అధికారాన్ని, పదవిని దుర్వినియోగం చేస్తూనే ఉన్నాడని ఆరోపించిందామె. జంతర్ మంతర్ వద్ద మొదటిసారి నిరసన తెలిపినప్పుడు ఒక అధికారిని కలిశానని, అయితే ఆ అధికారి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అధికారి పట్టించుకోకపోవడంతోనే మేము నిరసనకు దిగామని ఆమె తెలిపారు.

కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై వినేష్ ఫోగట్ హాట్ కామెంట్స్ చేశారు. లైంగిక వేధింపులపై మంత్రికి ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదని ఆమె అన్నారు. లైంగిక వేధింపుల గురించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో చర్చించిన తరువాత మేము మా నిరసనను ముగించామ. అయితే వారు కమిటీ వేసి ఇష్యూని దాచేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. కర్ణాటక ఎన్నికల వేళా బీజేపీపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పండితులు. మరోవైపు రెజ్లర్లు రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీపై బురద జల్లుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Read More: Sharad Pawar: పవార్ పవర్ తగ్గింది: దిలీప్ ఘోష్