Site icon HashtagU Telugu

YCP Politics:గౌతమ్ రెడ్డి స్థానంలోకి ఆయ‌న‌ సోద‌రుడు విక్ర‌మ్ రెడ్డి…!!

Mekapati Vikram Imresizer

Mekapati Vikram Imresizer

దివంగత ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ స్థానానికి త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉపఎన్నికల బరిలో గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి దిగనున్నారు. ఈ మేరకు గౌతమ్ రెడ్డి తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటన చేశారు. మేకపాటి కుటుంబం నేతృత్వంలోని కేఎంసీ కన్ స్ట్రక్షన్ కంపెనీ ఎండీగా విక్రమ్ రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు.

హార్ట్ ఎటాక్ కారణంగా మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడంతో ఆయన నేతృత్వం వహిస్తున్న ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి బై ఎలక్షన్ అనివార్యమైన విషయం తెలసిందే. గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్య బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ ఇదే విషయంపై తమ ఫ్యామిలీతో సుదీర్ఘ చర్చ జరిగిందని చెపిన రాజమోహన్ రెడ్డి…గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్యను కాకుండా, సోదరుడు విక్రమ్ రెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. ఈ విషయంపై తమ కుటుంబం మొత్తం కూడా ఏకగ్రీవంగానే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.