Site icon HashtagU Telugu

Air India: ఎయిర్ ఇండియా లిమిటెడ్ చీఫ్ గా విక్రమ్ దేవ్ దత్

Air India

Air India

ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మ‌న్ గా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి విక్ర‌మ్ దేవ్ ద‌త్ నియ‌మితులైయ్యారు. మంగళవారం కేంద్రం అమలు చేసిన సీనియర్-స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్ దత్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియ‌మించారు. విక్ర‌మ్ దేవ్ ద‌త్ 1993-బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.

అడిషనల్ సెక్రటరీ హోదా, వేతనంలో ఆయనను ఎయిరిండియా చీఫ్‌గా నియమించినట్లు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ హైవేస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చంచల్ కుమార్ నియమితులయ్యారు. ఈయ‌న 1992 బ్యాచ్ కు చెంద‌న‌ ఐఏఎస్‌ అధికారి.