Site icon HashtagU Telugu

Kamal Hasan : రూ. 400 కోట్ల క్ల‌బ్‌లోకి చేరిన క‌మ‌ల్‌హాస‌న్ విక్ర‌మ్ సినిమా

Kamal

Kamal

కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఒక్కో రోజు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. 25వ రోజు వేడుకలకు ముందు.. ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరి ఇప్పటికీ అనూహ్యంగా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మరో రెండు వారాల పాటు తమిళనాడులో ఈ సినిమా అత్యధిక స్క్రీన్‌ల్లో ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్‌లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 3న పలు భాషల్లో థియేటర్లలోకి వచ్చింది.