Central Govt: ఆధునిక హంగులతో వికారాబాద్ రైల్వే స్టేషన్, అభివృద్ధికి 24.35 కోట్లు!

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 10:12 AM IST

Central Govt: దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 24.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.ఇందులో భాగంగా మంజూరు అయిన నిధులతో రైల్వే స్టేషన్ ను ఆధునిక హంగులతో తీర్చి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఎసి గది, ఎక్స్ లెటర్, నిర్మించనున్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్ ఫామ్, టాయిలెట్స్ నిర్మాణాలు, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.

రైల్వే స్టేషన్ లో అధునాతన పబ్లిక్ అనౌన్స్మెంట్ విధానం, ఎల్ఈడి డిస్ప్లే తో స్టేషన్ పేరు కలిగిన బోర్డులు, వినియోగదారులకు అనుకూలమైన సూచికల ఏర్పాటు వంటి అదనపు సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. మౌనిక వసతులు అనేవి నేటి ప్రయాణికుల కు కచ్చితంగా అవసరం అని అది దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు చేయని విధంగా బిజెపి ప్రభుత్వం చేయడం హర్షించదగ్గ విషయం అంటున్నారు.

వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఇన్ఫోస్ట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం అదేవిధంగా కావలసిన సౌకర్యాలు చేయడం వల్ల ప్రయాణికులకు శుభలభంగా ఉంటుందని అన్నారు. దాదాపుగా 15000 మంది నిత్యం స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తారని, వికారాబాద్ నుంచి ముంబై బెంగళూరు బీదర్ భూమేష్ తిరుపతి గుంటూరు పల్నాడు ప్రాంతాలకు ఈ ప్రాంత ప్రజలు వెళ్తారని అన్నారు.