Site icon HashtagU Telugu

Vijayawada : విజయవాడ నుండి షార్జా కు విమాన సేవలు.. నేటి నుంచే..!

gannavaram airport

gannavaram airport

విజయవాడ నుంచి షార్జాకు నేటి నుంచి విమాన‌సేవ‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి, ఎయిర్ ఇండియా అధికారులతో అనేక పర్యాయాలు ఈ విషయమై ఢిల్లీ లో చర్చించడం జరిగింద‌ని.. ఆ కృషి ఫలితంగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్.. విజయవాడ నుండి షార్జా ( దుబాయ్ ) కు వారం లో రెండు రోజులు సేవ‌లు అందిస్తుంద‌న్నారు. ప్రతి సోమవారం, ప్ర‌తి శనివారం రాత్రి 9.05 గంటలకు విమానం బయలు దేరుతుందని ఎంపీ బాల‌శౌరి తెలిపారు. ఈ రోజు ( సోమ‌వారం) సాయంత్రం ఈ విమానం విజయవాడ కు వచ్చి షార్జా కు ప్రయాణీకులను తీసుకు వెళుతుందన్నారు. అలాగే విజయవాడ నుండి మస్కట్ కు ప్రతి శని వారం మధ్యాహ్నం 1.15 గంటలకు, విజయవాడ నుండి కువైట్ కు ప్రతి బుధ వారం 4.30 గంటలకు విమానాలు నడుపుతారని తెలిపారు.