ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపు విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. చివరి రోజు సాయంత్రం దుర్గమల్లేశ్వర స్వామివార్లకు తెపోత్సవం నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది తెపోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కృష్ణా నదికి వరదనీరు ఎక్కువగా వస్తున్నందున దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించాల్సిన తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నౌకా విహారాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. దుర్గా ఘాట్ వద్ద హంస వాహనంపై పూజల నిర్వహణకే అనుమతించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు వరద వస్తోందని.. మరో 3 రోజుల పాటు ఈ ఉద్ధృతి కొనసాగే అవకాశముందని తెలిపారు.
Durga Temple : కృష్ణానదిలో రేపు జరగాల్సిన తెపోత్సవం రద్దు

Tepostavam Imresizer