ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్య లో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. సరస్వతిదేవి దర్శనార్థం క్యూలైన్లో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున 2 గంటల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించారు. మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతిగా శక్తి రూపాలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. దాదాపుగా ఈ రోజు లక్షకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Durga Temple : సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ

Durga Temple