TVS Showroom: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. 300కు పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధం..?!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ (Vijayawada)లో భారీ అగ్నిప్రమాదం (Fire) జరిగింది. గురువారం తెల్లవారుజామున నగరంలోని స్టెల్లా కాలేజీ సమీపంలో ఉన్న టీవీఎస్ బైక్‌ షోరూమ్‌ (TVS Showroom)లో మంటలు చెలరేగాయి.

Published By: HashtagU Telugu Desk
TVS Showroom

Compressjpeg.online 1280x720 Image (4) 11zon

TVS Showroom: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ (Vijayawada)లో భారీ అగ్నిప్రమాదం (Fire) జరిగింది. గురువారం తెల్లవారుజామున నగరంలోని స్టెల్లా కాలేజీ సమీపంలో ఉన్న టీవీఎస్ బైక్‌ షోరూమ్‌ (TVS Showroom)లో మంటలు చెలరేగాయి. అవి షోరూంతోపాటు సర్వీసింగ్‌ షెడ్‌ కు కూడా వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. అయితే అప్పటికే షో రూమ్‌ మొత్తం దగ్ధమయింది. షోరూమ్‌తో పాటు గోదాములో ఉన్న సుమారు 300లకు పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read: KCR Cabinet: కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్, 3.00 ముహూర్తం ఫిక్స్

ఈ ప్రమాదంలో షో రూమ్‌లో ఉన్న 300లకుపైగా ఎలక్ట్రిక్‌, పెట్రోల్‌ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. షోరూమ్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. సమచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంంటలు చుట్టు పక్కల జనావాసాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పెట్రోల్‌ వాహనాలను ఉంచే గోదాము సమీపంలోనే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా పార్క్‌ చేసి ఉంచడం.. అలాగే వాటికి ఛార్జింగ్‌ పెట్టడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని మరికొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని.. తర్వాత అన్ని విషయలా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

  Last Updated: 24 Aug 2023, 01:33 PM IST